Homeజాతీయంపొరుగు దేశాలతో శతృత్వాలు పెట్టుకోలేం

పొరుగు దేశాలతో శతృత్వాలు పెట్టుకోలేం

– మాల్దీవులు కొత్త అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: అధికార బాధ్యతలు చేపట్టగానే తమ ద్వీప దేశం నుంచి భారత బలగాలను పంపిస్తామని చెప్పిన మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమది చాలా చిన్న దేశమని, పొరుగువారితో శతృత్వాలు పెట్టుకోలేమని అన్నారు. భారత్‌ , చైనా సహా అన్ని దేశాలతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 17న మయిజ్జు మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఇతర దేశాలతో విభేదాల గురించి స్పందించారు. ‘ఇతర దేశాలతో ఘర్షణల్లో చిక్కుకోవడానికి మాల్దీవులు చాలా చిన్న దేశం. ఇతర దేశాలతో ఘర్షణల కోసం మా విదేశాంగ విధానాన్ని వినియోగించుకునే ఆసక్తి లేదు’ అని మయిజ్జు వ్యాఖ్యానించారు. తమ దీవుల్లో మోహరించిన భారత బలగాలను పంపిస్తామని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత దళాల స్థానంలో చైనా దళాలను మయిజ్జు అనుమతిస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. దీనిపై మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

Recent

- Advertisment -spot_img