విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మార్చి 8న అయితే గామి ఆ తరువాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ రానున్నాడు. గామి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోండటంతో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. గామి కోసం ఆరేళ్లు ఎలా కష్టపడ్డాడో వివరించాడు విశ్వక్ సేన్. హిమాలయాలకు వెళ్లి రియల్ లొకేషన్స్‌లో సినిమాను షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ బాగా కష్టపడిందట. లిమిటెడ్ బడ్జెట్‌లో ఈ రేంజ్ క్వాలిటీ, అవుట్ పుట్ తీసుకు రావడానికి టీం అంతా చాలా కష్టపడిందట.ఇక విశ్వక్ సేన్ ఇతర హీరోల చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసేందుకు రెడీగా ఉన్నాడట. కాకపోతే ఆ పాత్రకు తగిన ప్రాధాన్యం ఉండాలని అంటున్నాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణ, బాబీ కాంబోలో సినిమాకు నో చెప్పాడట. అలా నో చెప్పడానికి గల కారణాన్ని బయట పెట్టేశాడు. బాలయ్యతో ఇంకా మంచి పాత్రను చేయాలని, ఆయనతో చేసే ఇంకా వేరే లెవెల్లో ఉండాలని అన్నాడట.