ఒకానొక రోజున మీరు నిద్రలేవగానే ఏ కారణం లేకుండానే మీకు చికాకుగా అనిపించడాన్ని గమనించారా ? ఇలా సంవత్సరంలో కేవలం రెండు లేదు మూడు సార్లు జరిగినా సరే, మీరు నిద్రపోయే ముందు కొన్ని పనులు తప్పకుండా చెయ్యాలి. ఎప్పుడూ కూడా, నిద్రపోయేముందు స్నానం చెయ్యండి. అది చాలా మార్పు తెస్తుంది. చలికాలంలో చన్నీళ్ళ స్నానం కష్టం కావచ్చు. అందుకే గోరువెచ్చని నీళ్ళతో చెయ్యండి, అంతేగానీ రాత్రుళ్ళు వేడి నీళ్ళతో స్నానం చెయ్యకండి. చన్నీటి స్నానం మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. మీకు ఒక పావుగంట లేదా అరగంట తరవాత నిద్రపట్టచ్చు, కానీ మీరు మరింత చక్కగా నిద్రపోతారు. ఒకరు వాడిన పిల్లోనూ వాడకండి, మీకంటూ ఒక ప్రత్యేక పిల్లోనూ మైంటైన్ చేయండి.