Homeసినిమాకెప్టెన్​ మిల్లర్​ ఆన్​ ది వే..

కెప్టెన్​ మిల్లర్​ ఆన్​ ది వే..

కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా మూవీ కెప్టెన్‌ మిల్లర్‌ . అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న కెప్టెన్‌ మిల్లర్‌ నుంచి లాంచ్ ఫస్ట్ సింగిల్ రిలీజైంది. ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌గా ఎర్రటి స్కార్ఫ్​ కట్టుకొని చేతిలో తుపాకీతో అగ్రెసివ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. నెట్టింట కెప్టెన్‌ మిల్లర్‌ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. యాక్టింగ్‌ మాన్‌స్టర్‌ ధనుష్‌.. కెప్టెన్ మిల్లర్‌ ఆన్ ది వే అంటూ ధనుష్​ ఫ్యాన్స్ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ఈ సినిమాలో హీరోయిన్​ కాగా.. సందీప్‌ కిషన్‌, నివేదితా సతీశ్‌, అమెరికన్‌ యాక్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్‌ స్పూర్తితో వస్తోన్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌ మరో కీ రోల్‌లో నటిస్తున్నాడు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img