మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పై పాలు అమ్ముతున్న వారిపై నుంచి కియా కార్నివల్ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.