గోల్కొండ దగ్గరలోని ఇబ్రహీంబాగ్‌లో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్‌లో ర్యాష్‌గా దూసుకొచ్చిన కారు బైక్‌పై వెళుతున్న వారిని ఢీకొట్టింది. బైక్‌పై వెళుతున్న చిన్నారి మృతి చెందగా.. తల్లిదండ్రులకు తీవ్రగాయాలు అయ్యాయి. కారు నడిపిన వ్యక్తి మద్యం తాగినట్లు స్థానికులు చెపుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న గోల్కొండ పోలీసులు.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.