ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై చునాఖల్ సమీపంలో కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో యువతి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు అంబులెన్స్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.