Homeఆంధ్రప్రదేశ్గోదావరి జిల్లాల‌లో క‌రోనా ఉగ్ర‌రూపం

గోదావరి జిల్లాల‌లో క‌రోనా ఉగ్ర‌రూపం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో తూర్పుగోదావరి జిల్లాలో 1398 పాజిటివ్‌ కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 1069 కొత్త కేసులు వ‌చ్చిన‌ట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 76,465 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9901 పాజిటివ్‌ కేసులు న‌మోదు కాగా 67 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 5,57,587కు, మ‌ర‌ణాల సంఖ్య 4846కు చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 95,733 యాక్టివ్‌‌ కేసులు ఉన్నాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img