Homeఆంధ్రప్రదేశ్ఏపీలో ఉద్ధృతంగా కరోనా వ్యాప్తి

ఏపీలో ఉద్ధృతంగా కరోనా వ్యాప్తి

గడిచిన 24 గంటల్లో 10,776 కొత్త కేసులు.. 76 మంది మృతి
అమ‌రావ‌తిః ఏపీలో క‌రోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొన‌సాగుతోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 10,776 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో 76 మంది క‌రోనాతో మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,76,506కి చేరగా, మరణాల సంఖ్య 4,276కి పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,405 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ వెయ్యికి పైగా కొత్త కేసులు గుర్తించారు. తాజాగా 12,334 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ మహమ్మారి నుంచి విముక్తులైన వారి సంఖ్య 3,70,163గా నమోదైంది. ఇంకా 1,02,067 మంది చికిత్స పొందుతున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img