నెల్లూరుః నెల్లూరు జీజీహెచ్ కోవిడ్ ఆసుపత్రిలో పరమేశ్వరమ్మ అనే కరోనా బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నారు. వార్డులోనే ఆమె ఆత్మహత్య చేసుకున్న ఎవరూ గమనించకపోవడం దారుణం, దురదృష్టకరమని ప్రజలు అధికారుల తీరును విమర్శిస్తున్నారు. ఏపీలో కోవిడ్ ఆసుపత్రుల్లో బాధితుల దయనీయ పరిస్థితికి ఇది నిదర్శనమని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. రాష్ట్రంలో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే ఇంత నిర్లక్ష్యంతో ఉంటారా? ఇదేనా విపత్తులలో వ్యవహరించే తీరు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జేసీని, నోడల్ అధికారిని అకస్మాత్తుగా బదిలీ చేసి ప్రభుత్వ చేతులు దులుపుకుందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులలో పర్యవేక్షణను సమీక్షించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
నెల్లూరు జీజీహెచ్‌లో కరోనా బాధితురాలు ఆత్మహత్య
RELATED ARTICLES