న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా డైలీ కరోనా కేసులు ఇండియాలో నమోదవడం కలవరపరుస్తున్నా.. అదే స్థాయిలో రికవరీలు ఉండటం కాస్తా ఊరటనిస్తోంది. రికవరీల్లో భారత్.. అమెరికాను దాటేసిందని శనివారం కేంద్ర ఆరోగ్యం శాఖ వెల్లడించింది. భారత్‌లో శనివారం ఉదయం నాటికి 42 లక్షల మందికి పైగా వైరస్ నుంచి కోలుకున్నారని, రికవరీ రేటు 79.28 శాతానికి చేరిందని, మరణాల రేటు 1.61శాతంగా ఉందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 93,337 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 53,08,015కు చేరుకుంది. తాజాగా మరో 1,247 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 85,619కి పెరిగింది. అమెరికాలో ఇప్పటి వరకు 67,23,933 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. 36,89,081 మంది కోలుకుని ఇండ్లకు పోయారు. 1,98,570 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.