న్యూఢిల్లీ: ఇండియాలో గడిచిన 24 గంటల్లో 75,809 కరోనా కేసులు, 1133 మరణాలు చోటు చేసుకున్నట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,80,423 చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 8,83,697. దేశంలో ఇప్పటివరకూ 33,23,951 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండగా.. అమెరికా ప్రథమ స్థానంలో ఉంది.