Homeఅంతర్జాతీయం‘స్పుత్నిక్‌-V’కి బ‌లే గిరాకీ

‘స్పుత్నిక్‌-V’కి బ‌లే గిరాకీ

20 దేశాల నుంచి 120 కోట్ల‌ డోస్‌ల‌కు ఆర్డ‌ర్స్
మాస్కోః రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ‘స్పుత్నిక్‌-V’కి బ‌లే గిరాకీ ఉంది. 20 దేశాల నుంచి 120 కోట్ల‌ డోస్‌ల‌కు ఆర్డ‌ర్స్ అందిన‌ట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ ‌(ఆర్‌డీఐఎఫ్‌) వెల్లడించింది. గమలేయ రీసెర్చ్‌ సెంటర్‌ పరిశోధకులు తయారుచేసిన ఈ వ్యాక్సిన్‌ మూడోదశ ప్రయోగాలు ప‌లు దేశాల్లో సాగుతున్నాయి. 2020చివరి నాటికే 20కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సిద్ధం చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు ఆర్‌డీఐఎఫ్ ప్ర‌క‌టించింది. ఇందులో 3కోట్ల డోసులను రష్యాలో.. మిగ‌తావి దక్షిణ కొరియా, బ్రెజిల్‌, సౌదీ అరేబియా, టర్కీ, క్యూబా, ఇండియాలో త‌యారు ఉత్ప‌త్తి చేసేందుకు ఆయా దేశాల్లోని ఫార్మా కంపెనీల‌తో ఒప్పందాలు చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల దాదాపు 10 కోట్ల డోసుల‌ను ఉత్ప‌త్తి చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో ర‌ష్యా ఒప్పందం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇస్ట్రాజెనికా, మోడెర్నా, ఫైజర్ ఫార్మా కంపెనీల వ్యాక్సిన్‌లు మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జరుగుతున్నాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img