Homeఅంతర్జాతీయండిసెంబ‌ర్‌క‌ల్లా మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్.. బ్లూప్రింట్ రిలీజ్‌

డిసెంబ‌ర్‌క‌ల్లా మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్.. బ్లూప్రింట్ రిలీజ్‌

వాషింగ్టన్ : ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ మేర‌కు బ్లూప్రింట్ కూడా విడుదల చేశాయి. మోడెర్నా 30 వేల మందిపై ప్రయోగాలు నిర్వహిస్తుండ‌గా.. ఫైజర్ 44 వేల మందిపై క్రినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. క‌రోనా నివారణకు తయారు చేస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించి పూర్తి ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడానికి మరింత సమయం పట్టే అవకాశముందని మోడెర్నా, ఫైజర్ కంపెనీలు పేర్కొన్నాయి. మొత్తం 135 పేజీల బ్లూప్రింట్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొనే వలంటీర్ల ఎంపిక విధానం, వారి వివరాలు, ప్రయోగాల అనంతరం వారి పర్యవేక్షణ, ప్రయోగాల్లో సమస్యలు తలెత్తితే అనుసరించాల్సిన విధానాలను ప్రస్తావించారు. అయితే ఈ ప్రయోగాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సంస్థలు గోప్యంగా ఉంచుతున్నాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img