న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసేందుకు ధనిక దేశాలు ముందు వరుసలో నిలుస్తున్నట్లు ఆక్సాఫామ్ తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో జనాభాలో కేవలం 13% శాతం వాటా కలిగిన ఈ దేశాలు ఏకంగా 50 శాతానికి పైగా వ్యాక్సిన్‌ను దక్కించుకునేందుకు ఇప్పటికే ఉత్పత్తి కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు నివేదిక కుండబద్దలు కొట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఫార్మా కంపెనీలు గెమెలేయా, మోడర్నా, ఫైజర్, ఆస్ట్రా జెనెకా, సైనోవాక్ కరోనా వ్యాక్సిన్‌లు వివిధ దశల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ కంపెనీల ఒప్పందాలను విశ్లేషించిన మీదటే ఈ అంచనాకు వచ్చినట్లు ఆక్స్‌ఫామ్ వెల్లడించింది.
ఈ అయిదు కంపెనీల పరిధిలో ఇప్పటివరకూ 5.3 బిలియన్ డోసులకు సంబంధించి ఒప్పందాలు కదిరినట్లు పేర్కొంది. ఇందులో దాదాపు 2.7 డోసుల(51శాతం) వ్యాక్సిన్ కోసం అమెరికా, బ్రిటన్, ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా, హాంగ్‌కాంగ్, జపాన్, స్విట్జర్‌ల్యాండ్, ఇజ్రాయెల్ దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక మిగిలిన 2.6 డోసుల కోసం భారత్, బాంగ్లాదేశ్, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయని ఆక్స్‌ఫామ్ తన తాజా నివేదికలో పేర్కొంది.
కరోనా వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్న ధనిక దేశాలు
RELATED ARTICLES