హైదరాబాద్: 15 ఏళ్ల క్రితం వచ్చిన అపరిచితుడు
గుర్తుందా.. స్టార్ డైరెక్టర్ శంకర్ తీసిన ఆ సినిమా విక్రమ్ కెరీర్ ను మలుపు తిప్పింది. అందులో హీరో ప్రభుత్వ అధికారుల అలసత్వం, అవినీతి పై పోరాటం చేస్తాడు. గరుడ పురాణంలోని శిక్షలని ఆధారంగా చేసుకుని జీవితంలో అన్యాయానికి గురైన ఓ వ్యక్తి మానసింక సంఘర్షణకు లోనై అపరిచితుడిగా మారి దోషుల్ని శిక్షించడం నేపథ్యంలో ఆలోచనాత్మకంగా ఈ చిత్రాన్నిశంకర్ తెరకెక్కించారు. ఇందులో హీరో విక్రమ్ తన చెల్లెలుని చిన్ననాడే అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోల్పో తాడు. దీంతో విక్రమ్, అతని తండ్రి సంబంధిత అధికారులు, మినిస్టర్లపై పలు సెక్షన్‌ల కింద కేసు పెడతారు.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే..అచ్చం అలాంటి కేసే ప్రస్తుతం తెలంగాణ డైనమిక్ లీడర్ మినిస్టర్ కేటీఆర్‌పై నమోదు అయ్యింది. కూతురు మరణించిన బాధలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఓ ఫ్యామిలీ ఈ కేసును పెట్టడం సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్గాలకు రోడ్లన్నీ చెరువుల్ని తలపి స్తున్నాయి. నాలలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్డుకు, నాలాలు ఏవో తెలియని రీతిలో వర్షపు నీరు ప్రవహిస్తోంది.
నేరేడ్‌మెట్ సమీపంలోని కాకతీయ కాలనీకి చెందిన 12 ఏళ్ల సుమేధ సైకిల్ తొక్కుతూ నాలలో పడి మృత్యు వాత పడిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, మినిస్టర్ కేటీఆర్ నిర్లక్ష్యం కారణంగా తమ కూతురు మృతి చెందిందని నేరేడ్‌మెట్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పుడదే కేసు రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.
కేటీఆర్ పై `అపరిచితుడు` తరహా కేసు నమోదు
RELATED ARTICLES