Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యేపై CASE FILE

బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యేపై CASE FILE

ఇదేనిజం, హైదారాబాద్​: మరో బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. హైదరాబాద్​ బంజారాహిల్స్​ లోని ఓ స్థలానికి చెందిన వివాదంలో షేక్​ పేట తహసీల్దార్​ అనితా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్​ రెడ్డిపై బంజారాహిల్స్​ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3లో ప్లాట్‌ నంబరు 8-సీ పేరుతో ఉన్న 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిలో ‘దీప్తి అవెన్యూ ప్రైవేట్‌ లిమిటెడ్‌’నిర్మాణం చేపట్టింది. అయితే ఈ సంస్థ కందాల ఉపేందర్​ రెడ్డిదే కావడం గమనార్హం. గతంలో ప్లాట్‌ నం.8-డీలో షౌకతున్నీసా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన ఉపేందర్‌రెడ్డి ‘8-సీ’లో స్థలాన్ని తమదిగా చెబుతున్నారు.

సర్వే నంబరులో మొత్తం 2.25 ఎకరాలు ఉండగా అందులో అత్యధిక భాగం షౌకత్‌నగర్‌ బస్తీగా ఏర్పడగా 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలంలో అవెన్యూ సంస్థ గతంలోనూ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా అప్పటి తహసీల్దార్‌ స్థలాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని ల్యాండ్‌ బ్యాంక్‌లో ఉంచారు. దీనిపై సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించగా యథాతథస్థితిని కొనసాగించాలని 2010లో కోర్టు ఆదేశించింది. కాగా, శనివారం తహసీల్దార్‌ అనితారెడ్డి విధుల్లో భాగంగా స్థలాన్ని పరిశీలించగా ప్రభుత్వ భూమి బోర్డు తొలగించి, షెడ్లు నిర్మించి వైన్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బంజారాహిల్స్‌ పోలీసుల సహకారంతో శనివారం రాత్రి తహసీల్దార్‌తో పాటు సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలన్నింటినీ సీజ్‌ చేశారు.

Recent

- Advertisment -spot_img