మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకుల మరో ప్రజా ప్రతినిధి, సినీ నటుడు తొట్టెంపూడి వేణుతోపాటు సంస్థ ఎండి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పనిని తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) ద్వారా ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ప్రాజెక్ట్ ను దక్కించుకొంది. ఈ పనిని బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ సంస్థలు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ నుండి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ప్రొజెట్ సంబంధించి స్వాతి కన్‌స్ట్రక్షన్ మధ్యలోనే ఆ పని నుండి తప్పుకోగా రిత్విక్ ప్రాజెక్ట్స్ 2002లో పనులు మొదలు పెట్టింది.
ఇక వారు చేసిన పనులకు రూ. 450 కోట్లను టీహెచ్‌డీసీ అందించింది. అందులో 5.5 శాతం ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ తీసుకొని, మిగిలిన 94.5 శాతం రిత్విక్ కన్‌స్రక్షన్స్ ఖాతాలో వేశారు. ఆ తరువాత ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కి, తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మిగిలిన పనులకుగాను రూ.1,010 కోట్ల విడుదల కాగా డబ్బు తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో జమ చేసింది.