టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఢిల్లీలో పరువునష్టం కేసు నమోదైంది. ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు, ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు మిహిర్ దివాకర్, అతడి భార్య సౌమ్య దాస్ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమపై అసత్య ఆరోపణలు, ఇబ్బందికరమైన ప్రకటనలు చేసి ధోని తమ పరువుకు భంగం కలిగించాడని కేసు వేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని పిటిషినర్లను కోరారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్, అనేక మీడియా ప్లాట్ ఫారమ్ లపై తమకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా నియంత్రించాలని కోర్టును అభ్యర్థించారు.
ఒప్పందాన్ని ఉల్లంఘించి తనకు చెల్లించాల్సిన రూ.16కోట్లు ఎగ గొట్టాడని ధోని చేసిన ఆరోపణలు తమకు పరువుక భంగం కలిగిందని, ప్రతిష్ట దెబ్బతిందని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసుపై జనవరి 18న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా.. దివాకర్, అతడి భార్య దాస్ తనను రూ.16కోట్లకు మోసం చేశారంటూ ధోని ఇటీవల క్రిమినల్ కేసు పెట్టారు. క్రికెట్ అకాడమీలు ఏర్పాటు ఏస్తామని చెప్పి ఒప్పందాన్ని ఉల్లంఘించారని క్రిమినల్ కేసు పెట్టారు. ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద రాంచీ కోర్టులో కేసు నమోదైంది.