హైదరాబాద్: కోపంతో ఓ మహిళ ఊగిపోతూ వాచ్‌మెన్‌పై చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. చందానగర్‌లోని శ్రీ రెసిడెన్సీలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపుతున్నారు. వీడియోలో వాచ్ మెన్ ని కొట్టిన మహిళ శ్రీలక్ష్మి (30) గా పోలీసులు గుర్తించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై చందానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్యాం తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. కూకట్‌పల్లి లో ఉండే శ్రీలక్ష్మి తన తల్లి సత్యవతి ఉండే చందానగర్‌లోని శ్రీ రెసిడెన్సీకి సోమవారం వచ్చింది. అక్కడ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న రఫీక్ ఆమెను అపార్ట్‌మెంట్‌లోకి అనుమతించకపోవడంతో లక్ష్మి కోపంతో అతడిని చెప్పుతో కొట్టింది. దీనిపై వాచ్‌మెన్ రఫీక్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.