తెలంగాణలో మొత్తం 243 రకాల కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీల్లో 134, ఎస్సీల్లో 59, ఎస్టీల్లో 32, ఓసీల్లో 18 సామాజిక వర్గాలున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన నేపథ్యంలో కులాలకు కోడ్లను కేటాయించింది. కులం, మతం లేదన్న వారికీ ఓ కోడ్ ను కేటాయించింది. ఇతర రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా కోడ్లతో డేటా సేకరిస్తోంది. భూ సమస్యలపైనా ప్రజల నుంచి వివరాలు తీసుకుంటోంది.