HomeతెలంగాణCAT warning : అతన్ని తీసుకుంటారా? మిమ్మల్ని పంపించాలా? సీఎస్​కు క్యాట్​ హెచ్చరిక

CAT warning : అతన్ని తీసుకుంటారా? మిమ్మల్ని పంపించాలా? సీఎస్​కు క్యాట్​ హెచ్చరిక

CAT warning : అతన్ని తీసుకుంటారా? మిమ్మల్ని పంపించాలా? సీఎస్​కు క్యాట్​ హెచ్చరిక

CAT warning : అభిషేక్ మొహంతిని రెండు వారాల్లో విధుల్లోకి తీసుకోవాలని సీఎస్‌కు క్యాట్​ ఆదేశం

CAT Fires on TS CS: ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రెండు వారాల్లో విధుల్లోకి తీసుకోవాలని సీఎస్ సోమేశ్​ కుమార్​ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఆదేశించింది.

సీఎస్ సోమేశ్​ కుమార్​పై అభిషేక్ మొహంతి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​ను ట్రైబ్యునల్ ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

అధికారుల విభజనలో భాగంగా అభిషేక్ మొహంతిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్​కు కేటాయించింది.

కేటాయింపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అభిషేక్ మొహంతి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు.

immunity-boosting : ఈ 5 మార్గాలతో రోగనిరోధక శక్తి

Kitchen Tips: నల్ల బెల్లమే ఎందుకు వాడాలి.. టీ పొడి కల్తీని గుర్తించడం ఎలా..

ఎనిమిది నెలలు అయినా…

విచారణ జరిపిన క్యాట్… అభిషేక్ మొహంతిని రిలీవ్ చేయాలని ఏపీకి.. విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణను ఎనిమిది నెలల క్రితం ఆదేశించింది.

క్యాట్ ఆదేశాల మేరకు అభిషేక్​ను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది.

అయితే తెలంగాణ ప్రభుత్వం తనను విధుల్లోకి తీసుకోవడం లేదంటూ సీఎస్ సోమేశ్​ కుమార్​పై అభిషేక్ మొహంతి క్యాట్​లో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.

గతంలో విచారణ జరిపిన క్యాట్.. ఇవాళ హాజరు కావాలని సోమేష్ కుమార్ ఆదేశించింది.

Early morning tips: రోజును ప్రారంభించడానికి ఆరోగ్య మార్గాలు

ఆ టైంలో గ్రీన్‌టీ తాగితే.. చాలా డేంజర్‌

సీఎస్​పై క్యాట్​ ఆగ్రహం

హాజరుకు మినహాయింపు ఇవ్వాలని త్వరలో కౌంటరు దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ క్యాట్​ను కోరారు.

నిరాకరించిన ట్రైబ్యునల్ గంటలోగా కనీసం ఆన్ లైన్​లో హాజరు కావాలని లేకపోతే నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.

కొద్దిసేపటి తర్వాత వర్చువల్ విచారణకు హాజరైన సోమేష్ కుమార్.. అభిషేక్ మహంతి వ్యవహారంపై కేంద్రానికి లేఖ రాశామని క్యాట్​కు తెలిపారు.

తాము ఆదేశించినప్పటికీ.. విధుల్లోకి ఎందుకు తీసుకోలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమ ఆదేశాలతోనే తెలంగాణలో కొనసాగుతున్నారంటూ సోమేశ్​ కుమార్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ట్రైబ్యునల్… అవసరమైతే తమ ఉత్తర్వులను పునఃసమీక్షిస్తామని హెచ్చరించింది.

వంటనూనెల్లో ఏది మంచిది…

అతిగా వ్యాయామం చేస్తే పిల్లలు పుట్టడం కష్టమే

ఆరోగ్య ప్ర‌ధాయ‌ని ‘బొప్పాయి’

Recent

- Advertisment -spot_img