తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వర్షపు నీటికి చాలా ప్రాంతాలలో చేపలు చెరువుల్లోంచి పొలాల్లోకి, నీరు రోడ్డు దాటే వద్ద ఓ పక్కన చేరి చేపలు సాదారణంగా చేతికి చిక్కుతున్నాయి. మూలుగు ఏరియా లో ఓ చెరువునిండి ఎదురెక్కుత్తున్నచేపలను పట్టుకున్న మత్స్యకారులు ఎడ్లబండిపైన తరలించారు. అలాగే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని పెద్ద కోడూరులో సైతం పొలాల్లోకి వచ్చిన నీటితో చేపలు రావడంతో గడ్డిలో తట్టుకున్న చేపలను గ్రామస్తులు నేరుగా వెళ్ళి పట్టుకుని తీసుకుపోయారు. కొందరు అక్కడే డాంబర్ రోడ్డుపై చేపలను పై పొట్టు ఊడేలా రుద్ది ఇంటికి తీసుకుపోయారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి దృష్యాలు కనపడుతున్నాయి.