Homeహైదరాబాద్latest Newsసీఈసీ రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత

సీఈసీ రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరి కింద వీఐపీ భద్రతను అరుదైన రీతిలో కేంద్రం కల్పించింది. ఎన్నికల నేపథ్యంలో పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా ఆయనకు పూర్తి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి భద్రతా సంస్థలు ఇటీవల సిఫార్సు చేశాయి. దీనిని పరిశీలించిన హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. CRPFకు చెందిన 40-45 మంది సిబ్బంది సీఈసీకి రక్షణ కల్పించే విధుల్లో ఉంటారు. ఆయనకు, ఎన్నికల కమిషనర్లకు ప్రస్తుతం దిల్లీ పోలీసులు సాయుధ భద్రత బృందం రక్షణ కల్పిస్తోంది. దివంగత టి.ఎన్ శేషన్‌కు గతంలో కొంతకాలం కేంద్ర బలగాల రక్షణ ఉండేది.

Recent

- Advertisment -spot_img