Homeజిల్లా వార్తలుఘనంగా చాకలి ఐలమ్మ 129 వ జయంతి వేడుకలు

ఘనంగా చాకలి ఐలమ్మ 129 వ జయంతి వేడుకలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129 వ జయంతి పురస్కరించుకొని ఐలమ్మ విగ్రహానికి మాజీ ప్రజా ప్రతినిధులు రజక సంఘం కుల బాంధవులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం గ్రామ కార్యదర్శి నరేష్, మాజీ సర్పంచ్ తడెపు జ్యోతి ఎల్లం, మాజీ సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య, సింగల్ విండో డైరెక్టర్ గాడిచెర్ల రామచంద్రం, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లు, బిజెపి నాయకులు జంగ ప్రభాకర్, రజక సంఘం అధ్యక్షులు సుద్దాల సుమన్, సుద్దాల నరేష్, సుద్దాల పారిశ్రరామలు, పారిపెళ్లి కాశయ్య, పారిపెళ్లి రాములు, పారిపెళ్లి దేవయ్య, సుద్దాల దేవయ్య, యువకులు రజక సంఘం కుల బాంధవులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img