Homeహైదరాబాద్latest Newsజులైలో తెలుగు ఇండస్ట్రీ 90 ఏళ్ల వేడుకలు : Manchu Vishnu

జులైలో తెలుగు ఇండస్ట్రీ 90 ఏళ్ల వేడుకలు : Manchu Vishnu

తెలుగు ఇండస్ట్రీ (Tollywood) 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జులైలో వేడుకలు నిర్వహించనున్నట్లు ‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. శనివారం ఉదయం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 90 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకల ద్వారా ఫండ్‌ రైజ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ‘మా’ సభ్యుల బాగోగుల కోసం వాటిని వాడుతామన్నారు.‘మలేసియా వేదికగా జులై నెలలో వేడుకలు నిర్వహించనున్నాం. సినీ పెద్దలతో చర్చించి.. వారి ఆశీస్సులు తీసుకుని తేదీని ప్రకటిస్తాం. ఈ మేరకు జులైలో షూటింగ్‌లకు మూడు రోజులపాటు సెలవులు ఇవ్వాలని కోరాం. దీనిపై ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు సానుకూలంగా స్పందించారు. దేశంలోని ఐదు అసోసియేషన్లతో ‘మా’ ఒప్పందం చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఘన కీర్తిని చాటి చెప్పేందుకే ఈ వేడుకలు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు గొప్ప దశలో ఉంది. ఈ సమయంలో నటీనటులుగా ఉన్నందుకు గర్వపడుతున్నా. చిరంజీవికి పద్మవిభూషణ్‌ రావడం గర్వించాల్సిన విషయం’అని తెలిపారు.

Recent

- Advertisment -spot_img