ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం, బదనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మన తెలంగాణ రాష్ట్ర సాధనకు కర్త ఆచార్య జయశంకర్ గారేనని, ఆయన చూపిన బాటలో నడిచిన తెలంగాణ ఉద్యమ ప్రతిఫలమే నేటి తెలంగాణ రాష్ట్రమని, ఆయనకు మనమంతా రుణపడి ఉండాలని వివరించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ ఎంతో గొప్ప మేధావి అని ఆయన ఆశయాలను మనం కొనసాగించాలని పిలుపునిచ్చారు. విద్యార్థిని విద్యార్థులు ఆచార్య జయశంకర్ గారి జీవిత విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, వేణుగోపాల్ చారి, సత్యనారాయణ రావు, స్వరూప, అనిత, రమణ, రవీందర్ రెడ్డి, బాలకిషన్,శారద దేవి, రాములు, శ్రీనివాస్, పర్ష రాములు పాల్గొన్నారు.