Homeహైదరాబాద్latest News56 ఏళ్లలో తొలిసారి ఓటు వేసిన అక్షయ్ కుమార్

56 ఏళ్లలో తొలిసారి ఓటు వేసిన అక్షయ్ కుమార్

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో పలువురు సెలబ్రిటీలు ఓటు వేశారు. అక్షయ్‌ కుమార్ , జాన్వీ కపూర్ , రాజ్‌కుమార్‌ రావ్‌, ఐరా ఖాన్‌, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్‌, షాహిద్‌ కపూర్‌ సహా పలువురు తారలు ఓటేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తొలిసారి ఓటేశారు. ఇప్పటి వరకూ కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్‌, గతేడాది ఆగస్టు 2023లో తొలిసారి భారతీయ పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మొదటిసారి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

49 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతి ఇరానీ, పీయూష్‌ గోయల్‌, సాధ్వి నిరంజన్‌ జ్యోతి, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు కీలక నాయకులు కూడా ఉన్నారు. 

Recent

- Advertisment -spot_img