Homeహైదరాబాద్latest Newsజైలులో సినీ హీరో దర్శన్‌కు సెల్‌ఫోన్ సరఫరా..?

జైలులో సినీ హీరో దర్శన్‌కు సెల్‌ఫోన్ సరఫరా..?

రేణుకా స్వామి హత్యలో కేసులో ప్రముఖ కన్నడ హీరో దర్శన్ ని మూడు నెలల క్రితం అరెస్టు చేశారు. తొలుత బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆయన అక్రమంగా సౌకర్యాలు పొందారనే ఆరోపణలతో బళ్లారి జైలుకు తరలించారు. అయితే తాజాగా ఆయనకి జైలులో సెల్‌ఫోన్ సిమ్‌కార్డు సరఫరా చేస్తున వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే పోలీసులు పరిశీలించగా.. పంగసవాడి ప్రాంతంలో ట్రావెల్స్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న మణివణ్ణన్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి పేరు మీద ఉందని, ఆ సిమ్‌కార్డు ద్వారా దర్శన్ వాట్సాప్‌లో మాట్లాడుతున్నాడని తేలింది. .దర్శన్ ఉన్న గదిలోనే ఉన్న రైడర్‌కు ఈ మొబైల్‌ ఫోన్‌, సిమ్‌కార్డు మణివణ్ణన్‌దేనని తేలింది. దీంతో పోలీసులు మణివణ్ణన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సిమ్ కార్డ్ మణివణ్ణన్ ట్రావెల్స్ డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి పేరు మీద కొనుగోలు చేయబడింది. ఆ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మణివణ్ణన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img