తెలంగాణలో కులగణన సర్వే నేపథ్యంలో.. పలు కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సర్వేలో తమ పేరును ఎక్కడ నమోదు చేయించుకోవాలనే దానిపై అయోమయం నెలకొంది. ప్రస్తుతానికి డోర్ నంబర్, యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తుండగా 9న సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభంకానుంది. ఈలోపు మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆధార్ లో అడ్రస్ ఉన్నచోటే వివరాలు నమోదు చేయించుకోవాలని సమాచారం. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.