నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగుల కోసం పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ స్కీమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌ను కేంద్రం ప్రారంభించబోతోంది. ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.4500 కేంద్రం, మరో 500 సదరు సంస్థ ట్రైనీలకు చెల్లిస్తాయి. అదేవిధంగా ఏడాదిలో ఒకసారి రూ.6 వేలను ఇన్సిడెంటల్ ఎక్స్‌పెన్స్‌గా అందించనున్నారు.