మీడియా చిత్రీకరణ అనేది మన దేశ జి.డి.పి. కి ఎంతో దోహదపడిన ప్రధాన ఆర్థిక ప్రక్రియ. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో, మీడియా ప్రొడక్షన్ కార్యకలాపాలలో పాల్గొన్న వివిధ వాటాదారులు మహమ్మారి వ్యాప్తిని పరిమితం చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం, అదే సమయంలో వారి వ్యాపార వ్యవహారాలూ, కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం లేదా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ రూపొందించిన, మీడియా చిత్రీకరణకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలపై మార్గదర్శక సూత్రాలు, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (ఎస్.ఓ.పి), కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ఈ రోజు విడుదల చేశారు. మార్గదర్శక సూత్రాల యొక్క ముఖ్యాంశాలలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్‌లో అనుమతించబడని పరస్పర అనవసర కార్యకలాపాలతో సహా, సాధారణ సూత్రాలను కలిగి ఉన్నాయి. వీటిలో, ఇతర వ్యాధులు, ప్రత్యేక అవసరాలతో ఉన్న ఉద్యోగుల పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖానికి మాస్కులు ఉపయోగించాలి, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి, ఇందుకోసం శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి వంటివి ఉన్నాయి. ఇంకా, శ్వాసకోశ సంబంధ జాగ్రత్తలతో పాటు ప్రత్యేకించి ప్రత్యేకంగా మీడియా ఉత్పత్తికి సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి.
భౌతిక దూరం పాటించడం, చిత్రీకరణ జరిగే ప్రదేశాలలో వ్యక్తుల ప్రవేశం నిష్క్రమణలను పరిమితం చేయడం, పరిశుభ్రత, సిబ్బంది భద్రత, కాంటాక్టులను కనీస స్థాయికి తగ్గించడం, క్వారంటైన్ / ఐసోలేషన్ తో సహా ప్రయాణాలకు సంబంధించిన ఎం.హెచ్.ఏ. జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ప్రకటించిన అంతర్జాతీయ పద్ధతులను పరిగణనలోకి తీసుకొని మంత్రిత్వ శాఖ సాధారణ ఎస్.ఓ.పి. లను రూపొందించింది. ముఖ్యంగా, ఫేస్ మాస్కులకు సంబంధించి, అంతర్జాతీయ పద్ధతుల ప్రకారం, కెమెరా ముందు నటించే నటీనటులు మినహా మిగిలిన తారాగణం మరియు సిబ్బంది ఫేస్ మాస్కును తప్పనిసరిగా ధరించాలి.
మీడియా ఉత్పత్తిని తిరిగి ప్రారంభించేటప్పుడు మార్గదర్శక సూత్రాలు మరియు ఎస్.ఓ.పి. ని అన్ని రాష్ట్రాలు, ఇతర భాగస్వాములు, మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చు.
మార్గదర్శకాలను విడుదల చేసిన అనంతరం కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ “ఎస్.ఓ.పి. అంతర్జాతీయ నిబంధనలను అనుసరిస్తుంది. కరోనా వైరస్ కారణంగా సుమారు 6 నెలలుగా ప్రభావితమైన పరిశ్రమకు ఇది పూర్తిస్థాయిలో ప్రోత్సహించి, సహాయపడుతుంది. మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ చర్యను ప్రజలు స్వాగతిస్తారు. ” అని పేర్కొన్నారు. చలనచిత్ర, టెలివిజన్ రంగం పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నందున, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు, శ్రీ జవదేకర్ చెప్పారు.
అన్ని రాష్ట్రాలు ఎస్.ఓ.పి. ని అంగీకరించి, అమలు చేస్తాయని, అవసరమైతే పరిస్థితులకు తోడ్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు, కేంద్ర దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఈ ఎస్.ఓ.పి. ని జారీ చేయడం జరిగింది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు… https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648038