HMPV వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారతదేశంలో హెచ్‌ఎంపీవీ కేసులు విజృంభిస్తుంది. ఈ క్రమంలో HMPV వైరస్ కేసులు వెలుగు చూడటంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ.నడ్డా కీలక ప్రకటన చేసారు. ఇదేమీ కొత్త వైరస్ కాదు.. 2001లోనే దీన్ని గుర్తించారు అని తెలిపారు. దేశంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది.. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము అని పేర్కొన్నారు. మేము పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము.. ప్రస్తుతం భయపడాల్సిన అవసరమేమీ లేదు అని జేపీ.నడ్డా ప్రకటించారు. ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి అని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీనడ్డా సూచించారు.