Homeహైదరాబాద్latest Newsకేంద్రం సాయం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రైలు మార్గం

కేంద్రం సాయం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రైలు మార్గం

ఏపీ రాష్ట్రంలో కేంద్రం సాయంతో గత 60 ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన కొవ్వూరు – భద్రాచలం రైలు మార్గం తాజాగా ప్రారంభం కానుంది. ఈ రైల్వే ప్రాజెక్టుకు భూసేకరణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని భావిస్తున్నారు. కొవ్వూరు-భద్రాచలం రోడ్డు రైలు మార్గం నిర్మిస్తే జిల్లాలోని మెట్ట మండలాలకు రైలు ప్రయాణం మరింత చేరువవుతుందని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఈ రైల్వే లైన్ నిర్మాణం అనుసంధానం కానుందని చెబుతున్నారు. ఈ రైలు మార్గాన్ని తల్లాడ-దేవరపల్లి హైవేకు అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఈ లైన్ గ్రీన్ ఫీల్డ్ హైవే వైపు ఉండగా చింతలపూడి, టి.నరసాపురం మండలాలకు రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మిగిలిన జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం మండలాలు ఏ వైపు నుంచి రైలు మార్గాన్ని నిర్మిస్తే ఆ మార్గానికి దగ్గరగా ఉంటుంది. భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వేస్టేషన్ నుంచి కొవ్వూరు వరకు ఈ లైను నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తి చేశాయి. అలాగే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న విజయవాడ లైన్‌కు ప్రత్యామ్నాయంగా గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే శాఖ నిర్మాణం చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రైలు మార్గం ద్వారా హైదరాబాద్-విశాఖపట్నం మధ్య 90 కి.మీ దూరం తగ్గుతుందని చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img