Homeహైదరాబాద్latest Newsవివక్ష పూరితంగా కేంద్ర బడ్జెట్.. వికసిత్ భారత్‌లో తెలంగాణ లేదా..?: మంత్రి శ్రీధర్‌బాబు

వివక్ష పూరితంగా కేంద్ర బడ్జెట్.. వికసిత్ భారత్‌లో తెలంగాణ లేదా..?: మంత్రి శ్రీధర్‌బాబు

కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వికసిత్ భారత్-2047లో తెలంగాణ లేదా? అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ..‘‘గ్రేటెస్ట్ ఎకనమిక్ ఇంజిన్‌గా ఉన్న తెలంగాణను కేంద్రం ఎందుకు చిన్నచూపు చూస్తుంది. తెలంగాణ లేకుండా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని కేంద్రం ఎలా సాధిస్తుంది. హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ నోడ్ ఏపీలోనే ఉంది. ఏపీకి నిధులివ్వడాన్ని తప్పుపట్టడం లేదు. కానీ. తెలంగాణకు కేటాయింపులు లేకపోవడం ఆక్షేపణీయం’’ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివక్షపూరితంగా, ప్రమాదకరంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ‘సమాఖ్య సూత్రాలకు విరుద్ధంగా బడ్జెట్ ఉంది. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పదాన్నే పలకకపోవడం బాధాకరం. కేంద్రం తెలంగాణ ప్రజల మనస్సు నొప్పించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పేర్కొన్నా కేంద్రం ఏపీకి మాత్రమే నిధులు కేటాయించి.. తెలంగాణను విస్మరించడం శోచనీయం’’ అని తెలిపారు.

Recent

- Advertisment -spot_img