Homeహైదరాబాద్latest Newsరైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. 2025 మార్చి నుంచి..!!

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. 2025 మార్చి నుంచి..!!

దేశంలోని రైతుల సంక్షేమానికి సంబంధించి మోడీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.ఈ క్రమంలోనే రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పీఎం కిసాన్ యోజన పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు పంటసాయం కింద ఏటా రూ.6 వేలు అందజేస్తున్నారు. ఈ 6 వేల రూపాయలను ప్రభుత్వం మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చిలో ఒక్కో విడతలో ఎకరాకు 2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. 2025 సంవత్సరంలోనే ఈ పథకం ద్వారా కేంద్రం ఏడాది మూడు విడతల్లో ఎలాంటి జాప్యం జరగకూడదు అని నిర్ణయించారు.డిసెంబర్-మార్చి, ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్.. ఇక నుంచి ఈ 3 విడతల ప్రారంభ నెలల్లో అంటే డిసెంబర్, ఏప్రిల్, ఆగస్టులో రైతులకు పీఎం కిసాన్ సొమ్మును జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే, పీఎం కిసాన్ 18వ విడతలో రూ.2వేలు అందని రైతులకు 19వ విడతతో కలిపి ఆ సొమ్మును జమ చేయనుంది ప్రభుత్వం. అంటే 18వ విడత, 19వ విడత కలిపి మొత్తం రూ. 4వేలు రైతుల ఖాతాల్లోకి వెళ్తాయి.

Recent

- Advertisment -spot_img