Homeజాతీయంవ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి

వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి

The central government has made available a link for those who want to take the corona vaccine.

Registration for the vaccine is required through selfregistration.cowin.gov.in.

The second phase of the vaccine distribution process began nationwide on March 1.

People over the age of 60 and those between the ages of 45 and 59 who are suffering from chronic diseases are being vaccinated at this stage.

రోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు కోసం కేంద్ర ప్రభుత్వం లింక్ అందుబాటులోకి వచ్చింది.

selfregistration.cowin.gov.in ద్వారా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.

60 సంవత్సరాలు కంటే పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఈ దశలో వ్యాక్సిన్ అందజేస్తున్నారు.

టీకా వేసుకోవడానికి అపాయింట్‌మెంట్ కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

సమీపంలోని కరోనా వ్యాక్సిన్ కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి లింక్ ద్వారా అవకాశం కల్పించారు.

Covid Vaccine Registration కోసం అనుసరించాల్సిన విధానాలను ఇక్కడ చూద్దాం..

కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం అనుసరించాల్సిన విధానాలు:

స్టెప్ 1: ముందుగా మీ మొబైల్ ఫోన్ (లేదా కంప్యూటర్)లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి selfregistration.cowin.gov.in అని టైప్ చేయాలి.

ఆ తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో లాగిన్, రిజిస్టర్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.

స్టెప్ 2: రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

(ఒక్క మొబైల్ నంబర్ ఆధారంగా నలుగురు కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు).

మొబైల్ నంబర్ టైప్ చేసి ‘Get OTP’పై క్లిక్ చేశాక.. మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.

ఆ ఓటీపీని ఎంటర్‌చేసి ‘VERIFY’ మీద క్లిక్ చేయాలి.

స్టెప్ 3: మొబైల్ నంబర్ వెరిఫై అయిన తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో ఫోటో ఐడీ ఫ్రూఫ్ (గుర్తింపు కార్డు), ఐడీ నంబర్, పేరు ఇతర వివరాలను నమోదు చేయాల్సిందిగా సూచిస్తుంది.

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం.. కిందివాటిలో దేన్నయినా గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి.

కరోనా వ్యాక్సిన్ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులు:

  • ఆధార్ కార్డు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • పాన్ కార్డు
  • పాస్‌పోర్టు
  • పెన్షన్ పాస్ బుక్
  • NPR స్మార్ట్ కార్డు
  • ఓటర్ ఐడీ

స్టెప్ 4: గుర్తింపు కార్డును ఎంచుకున్న తర్వాత దాని నంబర్‌ను ఎంటర్ చేయాలి (ఆధార్ అయితే.. 12 డిజిట్స్ ఆధార్ నంబర్ టైప్ చేయాలి)

స్టెప్ 5: ఎంపిక చేసుకున్న ఐడెంటిటీ కార్డు మీద ఉన్న ప్రకారం.. మీ పేరును నమోదు చేయాలి.

ఆ తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం పుట్టిన సంవత్సరం (ఇయర్ ఆఫ్ బర్త్) ఎంటర్ (ఐడెంటిటీ కార్డు మీద ఉన్న ప్రకారం) చేయాలి.

ఈ వివరాలన్నింటినీ కరెక్టుగా ఎంటర్ చేసిన తర్వాత ‘REGISTER’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

దీంతో మీ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.

స్టెప్ 6: మీ నమోదు ప్రక్రియ పూర్తైన తర్వాత మీ వివరాలు కనిపిస్తాయి. అందులో స్టేటస్ (Status) ఆప్షన్ వద్దకు వెళ్లి క్లిక్ చేయాలి.

Schedule Oppointment for Vaccination పై క్లిక్ చేయాలి. అక్కడ తొలుత రాష్ట్రం పేరును ఎంపిక చేసుకోవాలి.

ఆ తర్వాత జిల్లా, బ్లాక్, పిన్ కోడ్‌లను ఎంపిక చేసుకోవాలి.

ఈ వివరాలను ఎంపిక చేసుకొని ‘Search’ చేస్తే.. మీకు సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు కనిపిస్తాయి.

వాటిలో ఏదైనా ఒక వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి.

స్టెప్ 7: ఎంపిక చేసుకున్న వ్యాక్సిన్ కేంద్రంపై క్లిక్ చేసి, స్క్రోల్ చేస్తే.. ఆ వ్యాక్సిన్ కేంద్రంలో ఏ రోజు, ఎన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయో వివరాలు కనిపిస్తాయి.

మీ వీలును బట్టి వాటిలో నుంచి తేదీని ఎంపిక చేసుకోవాలి. ఉదయమా, సాయంత్రమా అనే వివరాలను ఎంచుకొని సెలెక్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ‘CONFIRM’ పై క్లిక్ చేయాలి. వ్యాక్సిన్ కోసం అపాయింట్‌మెంట్ కన్ఫామ్ అయిన తర్వాత ఆ వివరాలు మీకు అక్కడ డిస్‌ప్లే అవుతాయి.

స్టెప్ 8: మీరు ఎంపిక చేసుకున్న సమయానికి వ్యాక్సినేషన్ సెంటర్ వద్దకు రావాలి.

మీతో పాటు తప్పనిసరిగా గుర్తింపు కార్డు (రిజిస్ట్రేషన్ సమయంలో పేర్కొన్న ఐడెంటిటీ కార్డు) తెచ్చుకోవాలి.

గమనిక:

1. 60 ఏళ్ల పైబడిన వారైతే ఆధార్ తదితర ఐడెంటిటీ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది.

దీర్ఘకాలిక వ్యాధులతో (Comorbidities) బాధపడుతున్న 45 ఏళ్ల పైబడిన వారైతే.. వారి వ్యాధులకు సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది.

2. రిజిస్టర్ కోసం ఉపయోగించిన ఫోన్ నంబర్‌ను తదుపరి ప్రక్రియల (సెకండ్ డోసు, కుటుంబసభ్యుల వ్యాక్సినేషన్ తదితరాలు) కోసం లాగిన్ నంబర్ (Login)గా ఉపయోగించుకోవచ్చు.

3. ఒక ఫోన్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు Add More ఆప్షన్ ద్వారా మరో నలుగురికి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.

వారందరికీ విడిగా ఐడెంటిటీ కార్డులతో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చినప్పుడు ఎవరికి వారు తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డు తీసుకురావాలి.

అంటే, మొదటి రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన ఐడెంటిటీ కార్డు మీద కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ ఇవ్వరు. ఎవరిది వారే సపరేట్‌గా తీసుకెళ్లాలి.

4. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మీ వివరాలను లాక్ చేసి ఉంచుతారు. ఆ తర్వాత సెకండ్ డోసు, ఇతర వివరాల కోసమే ఎడిట్ ఆప్షన్‌ను ఇస్తారు.

5. ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 1075 కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img