Homeహైదరాబాద్latest Newsనీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి : డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్

నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి : డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్

7 ఏళ్లుగా తమిళనాడు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ విషయమై ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష వల్ల మెడిసిన్ చదవలేకపోయాననే నిరాశతో సేలం జిల్లాకు చెందిన పునీత ఆత్మహత్యకు పాల్పడిందన్న వార్త విని చాలా బాధపడ్డాను అని అన్నారు. ఆమె తల్లిదండ్రులకు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తెలిపారు. నీట్ పరీక్షను కేంద్రప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి అని అన్నారు.

Recent

- Advertisment -spot_img