Homeఫ్లాష్ ఫ్లాష్బారీగా పెరిగిన కేంద్రం అప్పులు

బారీగా పెరిగిన కేంద్రం అప్పులు

న్యూఢిల్లీ: జూన్ నెల చివరి నాటికి కేంద్రం అప్పులు 100 ట్రిలియన్(రూ.100 లక్షల కోట్లు)​ మార్కును దాటిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2020 ఏప్రిల్-జూన్)లో రూ.7 లక్షల కోట్లు పెరిగిందని, దీంతో కేంద్రం మొత్తం రుణ భారం రూ.101.3 లక్షల కోట్ల మార్క్‌ను దాటిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రం రుణ భారం జీడీపీలో 43 శాతంగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది 60 శాతానికి చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2017 ప్రకారం 2023 మార్చి నాటికి కేంద్రం రుణం జీడీపీలో 40 శాతం మించొద్దు.
గతేడాది జూన్‌ నెల చివరి నాటికి కేంద్రం అప్పు రూ.88.18 లక్షల కోట్లుగా ఉండగా.. 2020 మార్చి చివరి నాటికి కేంద్ర రుణ భారం రూ.94.6 లక్షల కోట్లు.. ఇప్పుడు ఇది రూ.101.3 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో పబ్లిక్ డెట్ వాటా 91.1 శాతంగా ఉంది. మోడీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3.46 లక్షల కోట్ల విలువైన సెక్యూరిటీ బాండ్లను జారీ చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ.21 వేల కోట్ల సెక్యూరిటీ బాండ్లను ఇష్యూ చేయడం గమనార్హం. వీటికి తోడు క్యాష్ మేనేజ్‌మెంట్ బిల్లు ద్వారా 2020 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.80 వేల కోట్లు సమీకరించింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img