Homeజాతీయం#Elections #KirenRijiju : జమిలి ఎన్నికలపై లోక్​సభలో కేంద్రమంత్రి వ్యాఖ్యలు

#Elections #KirenRijiju : జమిలి ఎన్నికలపై లోక్​సభలో కేంద్రమంత్రి వ్యాఖ్యలు

జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కేంద్రప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభకు తెలిపారు.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే ఎన్నికల వ్యయం ఎక్కువవుతుందని, జమిలి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసినట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు.

ఈ సిఫారసులను లా కమిషన్‌కు పంపించినట్టు చెప్పారు.

ఎన్నికల సంస్కరణలపైన లా కమిషన్‌ కూడా అనుకూలంగా సిఫారసులు చేసిందని, ప్రస్తుతం అవి కేంద్రం పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.

2014-19 మధ్యకాలంలో రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం రూ.5,814కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img