Homeఅంతర్జాతీయం‘అత్యవసరం’ సాకుగా లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తున్నరు

‘అత్యవసరం’ సాకుగా లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తున్నరు

బీజింగ్‌: చైనా తన తీరును మార్చుకోవడం లేదు. కరోనా వైరస్​ గురించి ప్రపంచం ముందు నిజాలు దాచిపెట్టిన చైనా తాజాగా వ్యాక్సిన్​ తయారీలోనూ దొంగరీతిగా వ్యవహారిస్తోంది. వరల్డ్ మీడియా కథనాల ప్రకారం.. చైనాలో లక్షల మందికి అనధికారికంగా కరోనా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు వేసుడు జూన్​ నుండే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగా చాలా మందిలో దుష్ప్రభావాలు తలెత్తినట్లు ఆ కథనాల సారంశం. ఈ చర్యలను చైనా అధికారులు సమర్థించుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించచిన ‘అత్యవసర వినియోగ’ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పడం గమనార్హం.
వ్యాక్సిన్​ తయారీలో నిమగ్నం అయిన కంపెనీలు ‘అత్యవసర వినియోగం’ పేరుతో వ్యాక్సిన్ల క్లినికల్​ ట్రయల్స్ పూర్తి కాకుండానే తమ ఉద్యోగులు, వాకి కుటుంబ సభ్యులకు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సినోఫార్మ్‌కు చెందిన ‘సీఎన్‌బీజీ’.. సుమారు 3.5 లక్షల మందికి ఈ టీకాను ఇచ్చింది. మరో సంస్థ సినోవ్యాక్‌.. తన ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్‌ను ఇచ్చింది. చైనా సైన్యం, కానాసినో అనే ఔషధ సంస్థ సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్​ను సైనిక సిబ్బందికి ఇస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img