Homeజిల్లా వార్తలునిజాం కు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ: ఎమ్మెల్యే తోట

నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ: ఎమ్మెల్యే తోట

ఇదే నిజం, జుక్కల్: జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుపాల్గొన్నారు.వేదిక మీద ఏర్పాటు చేసిన ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేమాట్లాడుతూ.భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికిచాటిచెప్పి,మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని ఆమె గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు.నిజాం నిరంకుశ పాలనకు, దొరలు, భూస్వామల ఆగడాలకు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు.ప్రత్యేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె చేసిన పోరాటం, ధైర్య సాహసాలు ప్రజలకు శాశ్వత స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు.ఐలమ్మ భూస్వాముల అణచివేతకు ఎదురొడ్డి నిలబడి పేదలకు, రైతులకు న్యాయం చేయడం కోసం కృషి చేసిన గొప్ప నాయకురాలు అని అన్నారు.ఆమె జీవితం మరియు పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం అని, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ చాకలి ఐలమ్మ ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పేర్కొన్నారు.ఆ వీర వనిత పోరాటానికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి సముచిత గౌరవం కల్పించింది అన్నారు.ఈ సందర్బంగా రజక సామాజికవర్గానికి తాను అండగా ఉంటానని,వారి పిల్లల చదువులు, ఉద్యోగాల విషయంలో తోడ్పాటు అందిస్తానని చెప్పారు.త్వరలో బిచ్కుంద మండల కేంద్రం మున్సిపాలిటీ అవుతుందని, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, స్థానిక మండల నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img