ఉగాది తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు ఉంటే గుండు కొట్టించుకుంటానని వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పవన్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నారు ముద్రగడ. తునిలో తనకు 15 వేల కంటే తక్కువ మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు మంత్రి దాడిశెట్టి రాజా. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఈ వ్యాఖ్యలను ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎక్కడున్నారు మీ ప్రతిజ్ఞలను ఎప్పుడు నెరవేర్చుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.