- కరీంనగర్ యువకుల యాత్రను ప్రారంభించిన బండి
ఇదే నిజం, ప్రధాన ప్రతినిధి : ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో కరీంనగర్ యువకులు అయోధ్యకు సైకిల్ పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నగరానికి చెందిన మంగ వంశీ కృష్ణ, ఆదిత్య యాత్రను శుక్రవారం బండి సంజయ్ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: పాపం సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్..
రాత్రి వేళల్లో మంచు కురిసే అవకాశమున్నందున జాగ్రత్తగా వెళ్లాలని, వీలైనంత మేరకు పగటిపూటే యాత్ర కొనసాగించాలని యువకులకు బండి సూచించారు. ఏమైనా ఇబ్బందులు తన దృష్టికి తేవాలని చెప్పారు. వారి యాత్ర విజయవంతంగా ముగించుకోవాలని ఆకాంక్షించారు.