బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ ఎంపీ బండి సంజయ్‌ను కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు శ్రేయ పెళ్లికి ఆహ్వానించేందుకు కేంద్ర హోంమంత్రిని కలిశారు. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రాన్ని ఆయనకు అందజేశారు. మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఇటీవల పలువురు రాజకీయ నేతలను కలుస్తూ ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు.