2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరగనుంది. ఒకవేళ పాకిస్థాన్‌లో టోర్నమెంట్ జరిగితే తాము పాల్గొనబోమని బీసీసీఐ పెద్దలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ నుంచి భారత్ తప్పుకుంటే శ్రీలంకకు అవకాశం దొరుకుతుంది. భారత్ స్థానంలో ఎనిమిదో జట్టుగా టోర్నమెంట్‌లో అడుగుపెట్టనుంది. అయితే ఐసీసీ మాత్రం భారత్ లేకుండా టోర్నమెంట్ నిర్వహించే అవకాశం లేదు. ఎందుకంటే భారత్ లేకపోతే టోర్నమెంట్ విలువ తగ్గిపోతుంది.