Champions Trophy 2025: మరో ఉత్కంఠభరితమైన పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఆదివారం దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగే టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడనుంది. భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే వరుస విజయాలతో సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. అయితే గ్రూప్-ఎ టాపర్ ఎవరు? ఈ రెండు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ ఫలితం నిర్ణయిస్తుంది. అయితే సెమీఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే సెమీఫైనల్లో తలపడే జట్లను ఇంకా ఖరారు చేయలేదు. ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ ఫలితం గ్రూప్-ఎ టాపర్‌ను నిర్ణయిస్తుంది. అయితే గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఫలితం వలన సెమీఫైనల్ బెర్తు ఈ విధంగా మారుతుంది.
ఇవాళ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ గెలిస్తే:
మార్చి 4: మొదటి సెమీ-ఫైనల్: భారత్ vs ఆస్ట్రేలియా, దుబాయ్
మార్చి 5: రెండవ సెమీ-ఫైనల్: న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా, లాహోర్.
ఇవాళ మ్యాచ్‌లో భారత్ పై న్యూజిలాండ్ గెలిస్తే:
మార్చి 4: మొదటి సెమీ-ఫైనల్: భారత్ vs దక్షిణాఫ్రికా, దుబాయ్
మార్చి 5: రెండవ సెమీ-ఫైనల్: న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా, లాహోర్.