Homeతెలంగాణచందానగర్​ పరువు హత్య: నా భర్తను చంపి ఏం సాధించారు.. చంపినోళ్లను వదలొద్దు

చందానగర్​ పరువు హత్య: నా భర్తను చంపి ఏం సాధించారు.. చంపినోళ్లను వదలొద్దు

హైదరాబాద్‌: 8 ఏండ్లు ప్రేమించుకున్నారు.. ఒకరంటే ఒకరికి ప్రాణం.. కానీ వీరి పెండ్లికి అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు. అమ్మాయికి వేరే సంబంధాలు చూడటం ప్రారంభించారు. దీంతో 3 నెలల క్రితం అమ్మాయి ఇంట్లో నుంచి వచ్చేసింది. పెండ్లి చేసుకోని వేరు కాపురం పెట్టారు. దీన్ని అవమానంగా భావించిన అమ్మాయి తరపు వారు ‘పరువు హత్య’కు ప్లాన్​ వేశారు. వ్యూహం ప్రకారం కిడ్నాప్​ చేశారు. దారుణంగా కొట్టి అబ్బాయిని చంపేశారు. ఊరటనిచ్చే విషయం ఏంటంటే అమ్మాయి తప్పించుకోని పోలీసుల వద్దకు చేరింది. తన మేనమామే ఈ హత్యకు పాల్పడ్డాడని కన్నీరుమున్నీరవుతోంది.
ఇదేదో సినిమాలో కథ కాదు. చందానగర్​లో జరిగిన యథార్థ సంఘటన. చందానగర్‌కు చెందిన హేమంత్‌ అతని ఇంటికి సమీపంలో ఉండే అవంతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో జూన్​ 10న బీహెచ్‌ ‌ఈఎల్‌ సంతోషీమాత ఆలయంలో వివాహం చేసుకోని గచ్చిబౌలిలో కాపురం పెట్టారు. ఓఆర్​ఆర్​పై ఎలాగోలా ఇద్దరు తప్పించుకోని పారిపోయేందుకు ప్రయత్నించారు. కొద్ది దూరం పరిగెత్తారు. కానీ హెమంత్​ను పట్టుకోని కొట్టుకుంటూ కారులో తీసుకెళ్లగా.. అవంతి తప్పించుకోని హెమంత్​ పేరెంట్స్ కి ఫోన్​ చేసి వివరాలు తెలియజేసింది.
హెమంత్​ పేరెంట్స్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ ఆచూకీ తెలియలేదు. నిన్న సాయంత్రం నుంచి పోలీసులు గాలింపు చేపట్టగా.. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కొల్లయ్యగూడెం వద్ద హేమంత్‌ శవమై కనిపించాడు.
గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో అవంతి.. బావలు, వదినలు, మామయ్యలు, మరి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో హేమంత్‌ ఇంటికి వచ్చి ఇద్దరినీ బలవంతంగా కారులో కిడ్నాప్​ చేసి తీసుకెళ్లారు.
ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి తండ్రి కిరాయి హంతకులతో హత్య చేయించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుకున్న కుమారుడ్ని దారుణంగా చంపేశారని హేమంత్‌ తల్లి రాణి బోరున విలపించారు. వేర్వేరు కులాలు అయినందు వల్లే తమ బిడ్డను పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంధువులే రాక్షసులు: హేమంత్‌ భార్య అవంతి
‘జూన్‌ 10న వివాహం చేసుకున్నాక నా పేరుతో ఉన్న ఆస్తులన్నీ మా కుటుంబ సభ్యులకు రాసిచ్చేసా. పెండ్లి ఇష్టం లేకుంటే నన్ను చంపాలి. కానీ హెమంత్​ని పొట్టనపెట్టుకున్నారు. మా బావలు, వదినలు, మామయ్యలు హెమంత్​ని, నన్ను కారులో బలవంతంగా తీసుకెళ్లారు. నేను మధ్యలో కారులోంచి దూకేసి తప్పించుకున్నాను. హేమంత్‌ను రౌడీలు కొట్టుకుంటూ కారులో తీసుకెళ్లారు. నిందితులు కొల్లూరులో ఓఆర్‌ఆర్‌ ఎక్కి పటాన్‌ చెరులో దిగారు. ఈ హత్య వారే చేయించారు.’ అని కన్నీరుమున్నీరవుతూ హేమంత్‌ భార్య అవంతి మీడియాకు చెప్పింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img