ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోంమంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమని, మహిళ అనితను అవమానించినట్లుగా ఉందని వారు అన్నారు. ఈ విషయాన్ని తాము దృష్టిలో ఉంచుకుంటామని పవన్ను హెచ్చరించారు మంద కృష్ణ మాదిగ.
ఈ విషయంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎం చంద్రబాబుని కలిసి ఆయనతో ఓక్క గంట మాట్లాడిన తరువాత బయటికి వచ్చి కృష్ణ మాదిగ పవన్ కళ్యాణ్ ను తిట్టారు అని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబుని కలిసిన తర్వాత ఎందుకు పవన్ ని తిట్టాడు అన్న సందేహం రాలేదంటారా.. అంటూ అయన పవన్ కళ్యాణ్ అభిమానులను ప్రశ్నించారు. కృష్ణ మాదిగని తిడుతున్నారు కాని కృష్ణ మాదిగ చేత పవన్ కళ్యాణ్ ని తిట్టించిన చంద్రబాబు ను ఒక్క మాటకూడా అనడంలేదు పవన్ అభిమానులు..అదే చంద్రబాబు మార్క్ రాజకీయం అని విజయసాయిరెడ్డి ట్విట్ చేసారు.