Homeఆంధ్రప్రదేశ్చిత్తూరు జిల్లా పర్యటన.. చంద్రబాబు v/s పోలీసులు

చిత్తూరు జిల్లా పర్యటన.. చంద్రబాబు v/s పోలీసులు

It is known that there was high tension during the visit of TDP national president Chandrababu Chittoor to the district.

He was on his way to the district when he was stopped by the police at Renigunta airport.

Stopped from going out of the lounge. Along with Chandrababu, his PA and medical officer forcibly snatched the phones of others.

టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా హైటెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే.

జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనను రేణిగుంట ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు.

లాంజ్ నుంచి బయటకు వెళ్లనివ్వకుండా నిలిపివేశారు. చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్య అధికారి ఇతరుల ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు.

కలెక్టర్, తిరుపతి, చిత్తూరు ఎస్పీలకు లేఖ ఇచ్చి వెళ్తానని పోలీసులకు చంద్రబాబు తెలిపారు.

అయినా అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు.

అనుమతి ఇచ్చే వరకు విమానాశ్రయంలోనే తన నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

ప్రతిపక్షనేతగా కలెక్టర్, ఎస్పీలను కలిసే హక్కు తనకు లేదా అని నిలదీశారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు, పోలీసులకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

పోలీసులు: పర్మిషన్ ఇవ్వలేదు సార్.

చంద్రబాబు: కలెక్టర్, చిత్తూరు, తిరుపతి ఎస్పీలను నేను కలవాలి. ఆ ముగ్గురికి సమాచారం ఇవ్వండి.

పోలీసులు: ఓకే సార్.

చంద్రబాబు: నేను ప్రెస్‌తో మాట్లాడాలి. నేనెందుకు వచ్చానో చెప్పాలి కదా. నాకు ప్రాథమిక హక్కులు లేవా… ఇదేం దౌర్జన్యం. నేనేమైనా హత్య చేయడానికి వెళుతున్నానా.. 14 ఏళ్లు సీఎంగా పని చేశానయ్యా.. ప్రతిపక్ష నేతను. తమాషాలు చేస్తున్నారా? మీరు పర్మిషన్ లేదన్నారు. నేను వెళతాను.

అయినా, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో… నిల్చున్న చోటే ఆయన నిరసనకు దిగారు. అక్కడే బైఠాయించారు.

పోలీసులు: సార్‌, మీరు పెద్దవాళ్లు, ఇక్కడ కూర్చొవడం బాగోదు. వేరేచోట కూర్చొవచ్చు. అక్కడకి వెళదాం.

చంద్రబాబు: నేను ఎస్పీ దగ్గరకు పోవాలంటే మీ పర్మిషన్ నాకెందుకు? కావాలంటే వెనకే అనుసరించండి. నేనెక్కడికైనా వెళ్లిపోతానా? కలెక్టర్ దగ్గరకు, చిత్తూరు, తిరుపతి ఎస్పీల దగ్గరకు నేను వెళ్లాలి.

పోలీసులు: సార్, ఇక్కడికే పిలిపిస్తాం.

చంద్రబాబు: నా దగ్గరకొద్దు. నేనంత గొప్ప వ్యక్తిని కాదు.

పోలీసులు: గౌరవసూచకంగా వారిని పిలిపిస్తాం.

చంద్రబాబు: నాకెందుకు గౌరవం. నా దగ్గరకు ఎందుకండి? నేనంత గొప్పోడిని కాదు. నేనే అక్కడికి వెళతాను. మీ అరాచకాలు ప్రపంచానికి తెలియాలి. కోవిడ్ ఉంది, కానీ అన్ని మీటింగులు జరుగుతున్నాయి. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరకు కూడా 50వేల మంది వస్తున్నారు. నన్నెందుకు అడ్డుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img